Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మనసున్న మారాజులు……. సంకినేని బ్రదర్స్

తుంగతుర్తి లో రిటైర్డ్ ఉద్యోగస్తుల కోసం… అడగగానే 25 లక్షల వ్యయంతో ఉచితంగా బిల్డింగ్ నిర్మాణం చేపట్టి అందజేత.

కీర్తి శేషులు సంకినేని కమలమ్మ రామారావు ల జ్ఞాపకార్థం ఈనెల 15న బిల్డింగ్ ప్రారంభోత్సవం పట్ల, రిటైర్డ్ ఉద్యోగస్తులు, మేధావులు ఈ ప్రాంత ప్రజల హర్షం.

గురువుల కోరిక మేరకు… గురుదక్షిణగా రిటైర్డ్ ఉద్యోగస్తుల విశ్రాంత భవనం.

తుంగతుర్తి, డిసెంబర్ 13 నిజం న్యూస్

గడిచిన 40 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో చిన్నచిన్న కాంట్రాక్టర్ గా పనులు చేస్తూ… అనతికారంలోనే ఉత్తమ కాంట్రాక్టర్ గా బిరుదును పొంది… మరొక ప్రక్క రాజకీయంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే పదవిని పొంది… ఈ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి… అభివృద్ధిలో పరుగులు తీస్తూ… ఈ ప్రాంత ప్రజలకు ఆపత్కాలంలో మేము ఉన్నామంటూ, ముందుకు వచ్చి ఎన్నో పేద కుటుంబాలను ఆదుకున్న చరిత్ర సంకినేని బ్రదర్స్ కే చెందుతాయి….

తుంగతుర్తి మండలంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన, రిటైర్డ్ ఉద్యోగుల కోసం అడగగానే సుమారు 25 లక్షల వ్యయంతో కీర్తిశేషులు సంకినేని కమలమ్మ రామారావు దంపతుల జ్ఞాపకార్థం, త్రిమూర్తులు సంకినేని కృష్ణారావు, సంకిరేణి వెంకటేశ్వరరావు, సంకినేని రవీందర్రావు కుటుంబాల ఐకమత్యంతో కలిసి, ఒకరికొకరు చర్చించుకొని, సుమారు ఆరు నెలల కాలంలో …150 మంది రిటైర్డ్ ఉద్యోగస్తుల స్వప్నమైన రిటైర్డ్ ఉద్యోగస్తుల విశ్రాంతిభవనాన్ని, ఉద్యోగులు ఖాళీ స్థలమును కొనుగోలు చేసుకోగా ,తెలంగాణ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో ఇటువంటి డిజైన్తో ,సకల సౌకర్యాలతో పూర్తిస్థాయి బిల్డింగును ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి కూడా ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని ముక్కు సూటిగా చెప్పవచ్చు…

మన రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా గురువుల కోరిక మేరకు… గురుదక్షిణంగా త్రిమూర్తులైన సంకినేని బ్రదర్స్ తమ సొంత ఖర్చులతో తుంగతుర్తిలో ఈనెల 15న రిటైర్డ్ ఉద్యోగుల విశ్రాంత భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుదలడం పట్ల ఈ ప్రాంత రిటైర్డ్ ఉద్యోగస్తులు మేధావులు ,వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రజలు సంకినేని కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ… వారి కుటుంబ సభ్యులు, కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని నిజం న్యూస్ తో ముచ్చటించారు..

గురువుల కోరికను…. తీర్చిన సంకినేని బ్రదర్స్ కు ప్రత్యేక అభినందనలు

ఓరుగంటి సత్యనారాయణ, రిటైర్డ్ ఉద్యోగి తుంగతుర్తి

తుంగతుర్తి మండలంకు చెందిన సుమారు 150 మంది వివిధ శాఖలలో ఏడు ఉద్యోగస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరం కలిసి తుంగతుర్తి లో రిటైర్డ్ ఉద్యోగుల విశ్రాంత భవనాన్ని కావాలని సంకినేని బ్రదర్స్ ను కోరగా, తక్షణమే వారు సంతోషపడి కనివిని ఎరుగని రీతిలో మీకు మేము మా సొంత ఖర్చులతో బిల్డింగును నిర్మాణ పనులు చేపట్టి ఇస్తామని హామీ ఇచ్చారు దీనిలో భాగంగా సుమారు 20 లక్షలకు పైగా సొంత నిధులతో వారి తండ్రిగారైన కీర్తిశేషులు సంకినేని రామారావు దంపతుల జ్ఞాపకార్థం మాకు నూతన బిల్డింగును ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. ఈ అవకాశాన్ని రిటైర్డ్ ఉద్యోగస్తులు అందరూ పొందడం పట్ల వారి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము.

రాష్ట్రంలోనే మొట్టమొదటి …విశ్రాంతి ఉద్యోగస్తుల భవనం

పోలవరపు సంతోష్, రిటైడు ఉద్యోగస్తుల సంఘం మండల అధ్యక్షులు.

రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం సభ్యుల కోరిక మేరకు అడగగానే సంకినేని బ్రదర్స్ ఒప్పుకొని అనతి కాలములోనే 20 లక్షల వ్యయంకు పైగా సొంత డబ్బులు వెచ్చించి, నూతన బిల్డింగును అందించడం ఈ ప్రాంత రిటైర్డ్ ఉద్యోగస్తులకు శుభ పరిమాణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనాన్ని ఉచితంగా అందించిన ఘనత సంకినేని బ్రదర్స్ దేనని చెప్పుకోక తప్పదు . వారి కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని రిటైర్డ్ ఉద్యోగస్తుల కోరుతున్నట్లు పేర్కొన్నారు.