ఏకలవ్యుడు ని అభినందించి, సన్మానించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ డిసెంబర్ 13 (నిజం న్యూస్)
స్వశక్తితో విలువిద్యను నేర్చుకొని జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న హుజూర్నగర్ ఏకలవ్యుడు
హుజూర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఈరోజు క్యాంప్ ఆఫీస్ లో విలువిద్యలో ప్రావిణ్యత చూపి జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్న పంగ సాయి గోపి నీ అభినందించి సన్మానించడం జరిగింది
హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన పంగా సాయి గోపి మొదటగా కబడ్డీ ఆటలో ప్రధాన వస్తుండగా తన మామ యొక్క సూచనల మేరకు ఆర్చరీ విలువిద్యలో ప్రవేశించి ఆనతి కాలంలోనే అద్భుతమైన మెరుగైన ప్రతిభకు రావాల్సి జాతీయస్థాయిలో తన యొక్క ప్రదర్శనలు ఇచ్చి బంగారు పతకాలను గెలుచుకోవడం జరిగింది2021 లో ఇండోర్ లో జరిగిన నేషనల్స్ లో తెలంగాణ తరపున ఆడి బంగారు పతాకాన్ని సాధించి రాష్ట్రాన్ని మొదటి స్థానం లో నిలబెట్టినడు..ఇప్పుడు 2022 డిసెంబర్ 23 న పంజాబ్ లో జరుగనున్న జాతీయ సీనియర్ స్థాయి టోర్ననెంట్స్ లో పంజాబ్ లో తెలంగాణ తరపున అడనున్నాడు
మరి స్వశక్తితో విలువిద్య ప్రావీణ్యాన్ని కనబరిచి అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తున్న ఈ ఏకలవ్యునికి హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారు ఈరోజు తాను బిజీగా ఉండటం వలన తన క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని వెన్నుతట్టి అభినందించి ప్రోత్సహించి సన్మానించారు అదేవిధంగా భవిష్యత్తులో కావలసిన సహాయాన్ని అందిస్తానని జరగబోయే జాతీయ గవర్నమెంట్ లో బంగారు పతకాన్ని గెలుచుకొని తెలంగాణ రాష్ట్రము హుజూర్నగర్ నియోజకవర్గము లింగగిరి గ్రామానికి పేరు ప్రతిష్టలు తేవాలని సూచించడం జరిగింది
ఈ కార్యక్రమంలో హుజర్నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి గారు, ఎంపీటీసీ విజయలక్ష్మి గారు ,మార్కెట్ చైర్మన్ వెంకట్ రెడ్డి గారు ,వైస్ చైర్మన్ గువ్వల వీరయ్య గారు ,కడియాల రమేష్ ,ఎస్ ఇస్మాయిల్, పాల్గొన్నారు.