కేసులు నమోదు కాని పోలీస్ స్టేషన్….

గట్టుప్పల్, డిసెంబర్ 13 (నిజం న్యూస్)… నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల మండలంలో పోలీస్ స్టేషన్ అక్టోబర్ 2న ప్రారంభించినప్పటి కీ అందులో నేటికీ ఒక్క కేసు (ఎఫ్ ఐ ఆర్) కూడా నమోదు చేయలేదు . స్టేషన్ కు ఎస్సై ను నియమించారు. మరి కొంత మంది సిబ్బందిని చండూరు పోలీస్ స్టేషన్ నుంచి సమకూరుస్తున్నారు. ఎఫ్ ఐ ఆర్ మాత్రం విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించిన మండలాలకు చెందిన పోలీస్ స్టేషన్ల లోనే నమోదు చేస్తున్నారు. ఈ విషయమై సీఐ అశోక్ రెడ్డిని వివరణ కోరగా కొత్త పోలీస్ స్టేషన్ కావడంతో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఎఫ్ఐఆర్ ఎక్కడ నమోదు చేసినప్పటికీ కేసుకు కు సంబంధించి గట్టుప్పల ఎస్సై నే విచారణ అధికారిగా ఉండడంతో సమస్య ఏమీ ఉండదన్నారు. నూతన మండలం గట్టుపల్ లో శాంతిభద్రతల కు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.