అసెంబ్లీ సమావేశాల్లో గోరి కొత్తపల్లి మండలం ఏర్పాటు.!

– తిరుమలగిరి భౌగోళికంగా అటవీ ప్రాంతం కోనరావుపేట శివారు అటవీ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.
– తిరుమలగిరి నుండి గోరి కొత్తపల్లికి 7 కి. మీ దూరం మాత్రమే వయా జగ్గయ్యపేట *
– తిరుమలగిరి గ్రామం గోరి కొత్తపల్లి మండలంలోనే విలీనం.
ఉదాహరణకు హన్మకొండ జిల్లా నడికుడ మరియు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాలు పలు గ్రామాలకి 20 నుండి 25 కి. మీ దూరం జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 8 నిజం న్యూస్ : జిల్లాలోని రేగొండ మండలం జాతీయ రహదారి 353సి రోడ్డు ఇవుతలి గ్రామాలైన రూపిరెడ్డిపల్లి, చెన్నపురం ,చెంచుపల్లి , తిరుమలగిరి ,జగ్గయ్యపేట, రామగుండాలపల్లి , చిన్నకోడెపాక , దామరంచపల్లి ,విజ్జయ్యపల్లి , రాజక్కపల్లి , గోరికొత్తపల్లి, నిజాంపల్లి , గాంధీనగర్ , కోనరావుపేట , సుల్తాన్ పూర్ , వెంకటేశ్వర్లపల్లి , జమ్ షెడ్ బెగ్ పేట మూడు నుండి తొమ్మిది కి.మీ దూరం మాత్రమే ఉండి, రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తుంది. జాతీయ రహదారి 353సి,163, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ రోడ్లు కలిగి ఉండి జాతీయ రహదారి 363 రూపిరెడ్డిపల్లి , రేగొండ నుండి గోరి కొత్తపల్లి వరకు 8 కి.మీ దూరం, జాతీయ రహదారి 163 అబ్బాపురం క్రాస్( జాకారం) ములుగు 8 కి.మీ, హౌజ్ బుజుర్గ్, కటాక్షపూర్ 12 కి.మీ దూరం గోరికొత్తపల్లి నుండి ఉంటుంది. తిరుమలగిరి భౌగోళికంగా రెవెన్యూ భూములు జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, సుల్తాన్ పూర్ , కోనరావుపేట శివారు వరకు అటవీ ప్రాంతం విస్తరించి ఉండి బుగులోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఈ గ్రామాలకు అనుబంధంగా ఉంది.తిరుమలగిరి గ్రామాన్ని రేగొండ మండలంలో కొనసాగితే ఈ గ్రామాలకు రెవెన్యూ పరంగా రేగొండ , గోరికొత్తపల్లి రెండు మండలాలకు వెళ్ళాడం వల్ల పలు సమస్యకు ఉత్పన్నమవుతాయని భూములు రేగొండ మండలంలో జనాభా లెక్కల పరంగా మరో మండలం గోరి కొత్తపల్లిలో ఉండడం వల్ల ఈ గ్రామాల ప్రజలకు, రైతులకు,విద్యార్థులకు పలు సమస్యలు,చిక్కులు ఎదురవుతాయనీ తిరుమలగిరి గ్రామాన్ని గోరి కొత్తపల్లి మండలంలో విలీనం చేయాలనే డిమాండ్ చేయడం విదితమే. పూర్వ శాయంపేట నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామాలు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో శాయంపేట రద్దయి భూపాలపల్లి నియోజకవర్గం ఆవిర్భవించింది. ఈ గ్రామాలు భూపాలపల్లి నియోజకవర్గంలో కి వచ్చాయి. రేగొండ మండలంనకు కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవస్థానం ఉంది కనుక తిరుమలగిరి శివారులోని బుగులోని వేంకటేశ్వర స్వామి జాతర తిరుమలగిరి గ్రామం కంటే జగ్గయ్యపేట, వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట గ్రామాలకు చాలా దగ్గర్లో ఉంటుంది. గోరి కొత్తపల్లి మండలంలోనే తిరుమలగిరి గ్రామం విలీనం అయ్యే అవకాశం ఉంది. – ములుగు జిల్లా వెంకటాపూర్(ము) మండల కేంద్రం పలు గ్రామాలకి దూరం 20 నుండి 25 కి.మీ : ములుగు జిల్లా వెంకటాపూర్(ము)మండలం ఇంచెంచెరువుపల్లి గ్రామస్తులు 25 కి. మీ వెంకటాపూర్ మండల కేంద్రానికి వెళ్ళాలంటే ములుగు మండలంలోని జాకారం ద్వారా ములుగు జిల్లా కేంద్రం నుండి జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల ద్వారా,నర్సాపురం, కేశావపురం, సింగరగుంటపల్లి, పాపయ్యపల్లి గ్రామస్తులు 20 కి. మీ, రాజేశ్వర్ రావుపల్లి, శాతరాజుపల్లి గ్రామస్తులు 25 కి.మీ ములుగు జిల్లా కేంద్రం ద్వారా,లింగపురం, జవహర్ నగర్ గ్రామస్తులు ములుగు మండలం జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల ద్వారా 25 కి మీ వారి మండలం వెంకటాపూర్ వెళ్ళాలంటే ములుగు మండలం ద్వారా ప్రయాణించి ఒక మండలం ములుగు దాటి ఇంకో మండలం స్వంత మండలం వెంకటాపూర్ మండల కేంద్రానికి చేరుకుంటారు. *నడికుడ, దామెర మండలాలు ఏర్పాటులో ఎమ్మేల్యే చల్లా ధర్మా రెడ్డిది కీలక పాత్ర** హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటే మండలాలు తక్కువ ఉన్నాయని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మా రెడ్డి చొరవ తీసుకుని కొత్తగా ఆత్మకూర్ మండలాన్ని విభజించి నూతన దామెర మండలాన్ని ఏర్పాటు చేశారు.అలాగే పరకాల మండలాన్ని విభజించి నడికుడ మండలం ఏర్పాటు చేయటంలో ఎమ్మేల్యేది కీలక పాత్ర పోషించి వరికోల్, నార్లాపురం, కంటాత్మకుర్,పులిగిల్ల, రామకృష్ణపురం,ధర్మారం, గ్రామస్తులు మేము పరకాల మండలంలోనే కొనసాగుతామని,నడికుడ మండలానికి మా గ్రామాలకు 20 కి. మీ – 25 కి. మీ దూరం ఉంటుందని నడికుడ మండలం వెళ్ళాలంటే పరకాల మండల కేంద్రము ద్వారానే ప్రయాణించాలని,పరకాల నుండి నడికుడ మండలంలో విలీనం చేస్తే సహించేది లేదని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తామని గట్టిగా హెచ్చరించారు.దీంతో పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి రంగంలోకి దిగి ఆ గ్రామాల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి నడికుడ మండలంలో ఆ గ్రామాలను చేర్చి పరకాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన ఘనత పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మా రెడ్డి విజయం సాధించారు. – గోరి కొత్తపల్లి మండలం ఏర్పాటు తిరుమలగిరి గ్రామం విలీనం : పూర్వపరాలు పరిశీలిస్తే భౌగోళిక స్వరూపం,సరిహద్దులు తిరుమలగిరి అటవీ ప్రాంతం కోనరావుపేట శివారు వరకు అడవులు విస్తరించి ఉండడం జాతీయ రహదారి 363సి రోడ్డు ఇవుతలి గ్రామాలు పూర్వ శాయంపేట నియోజకవర్గంలో ఉండటం వలన గోరి కొత్తపల్లి మండలంలో ఈ గ్రామాలు విలీనం కానున్నాయి.తిరుమలగిరి గ్రామ రెవెన్యూ శివారు భూములు జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, వెంకటేశ్వర్లపల్లి వరకు కోనరావుపేట శివారు అటవీ ప్రాంతం వరకు విస్తరించి ఉండడం, బుగులోని వేంకటేశ్వర స్వామి జాతర అనుబంధంగా ఉన్నందున తిరుమలగిరి గ్రామాన్ని రేగొండ మండలం నుండి విభజించి గోరి కొత్తపల్లిలో విలీనం నూతన మండలం గోరి కొత్తపల్లిని ఏర్పాటుచేసేలా భూపాలపల్లి ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి, జిల్లా యంత్రాంగం,అధికారులు గోరికొత్తపల్లి మండల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో త్వరలోనే అధికారికంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంగా ప్రకటించనున్నారు. ప్రతిపాదనలు ఇలా : రేగొండ మండలంలో ఉండే రెవెన్యూ గ్రామాలు తొమ్మిది : భాగీరథిపేట,కనపర్తి, కొడవటంచ,లింగాల, మడతపల్లి, పొనగండ్ల, రామన్న గూడెం,రేగొండ, రేపాక. *గోరి కొత్తపల్లి మండలంలో విలీనం అయ్యే రెవెన్యూ గ్రామాలు తొమ్మిది : చిన్నకోడెపాక, చెన్నాపురం, దమ్మన్నపేట, గోరి కొత్తపల్లి, జమ్ షెడ్ బెగ్ పేట, జగ్గయ్యపేట, కోనరావుపేట, సుల్తాన్ పూర్, తిరుమలగిరి ఉండనున్నాయి. గోరి కొత్తపల్లి మండలానికి సరిహద్దులు : తూర్పున ములుగు జిల్లా ములుగు మండలం, ఈశాన్యన వెంకటాపూర్( ము), పచ్చిమాన హన్మకొండ జిల్లా పరకాల మండలం,దక్షిణాన శాయంపేట మండలం, ఉత్తరాన రేగొండ మండలాలు సరిహద్దులు.