ఘనంగా కర్నాటి విద్యాసాగర్ జన్మదిన వేడుకలు

చండూరు, డిసెంబర్ 8 (నిజం న్యూస్), తెరాస రాష్ట్ర నాయకులు కేవీఎస్ ఫౌండేషన్ అధినేత మునుగోడు నియోజకవర్గానికి చెందిన కర్నాటి విద్యాసాగర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు నియోజవర్గంలో ఘనంగా గురువారం జరుపుకున్నారు. పలుచోట్ల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తూ ఆయన పైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ వాదం తెరపైకి వస్తే టిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ దక్కే అవకాశాలు తమ నాయకునికి ఉన్నాయంటూ అభిమానులు చెబుతున్నారు. కెవిఎస్ ఫౌండేషన్ తరపున కర్నాటి విద్యాసాగర్ ఇప్పటికే పలువురికి ఆర్థిక సహాయాలు అందిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఏదేమైనా టికెట్ తో సంబంధం లేకుండా పార్టీకి , సీఎం కేసీఆర్ కు ,మంత్రి కేటీఆర్ కు విధేయుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు సాగుతానని విద్యాసాగర్ అంటున్నారు.