పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు…మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట లేఖ విడుదల

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట లేఖ విడుదల
చర్ల డిసెంబర్ 2 ( నిజం న్యూస్) అధికార పార్టీ నేతలు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి జగన్ పేరిట సోషల్ మీడియా వేదికగా లేఖవిడుదల చేశారు ఈ లేఖలో వాజేడు మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్ల కృష్ణారెడ్డి.కావిరి అర్జున్. అర్రెమ్ లచ్చు పటేల్. బొల్లు దేవేందర్ దుర్గం రమణయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏటూరు నాగారం కు చెందిన ఇరసవడ్ల వెంకన్న పేర్లను పొందుపరిచారు సంబంధిత వ్యక్తులు అక్రమ దందాలకు పాల్పడుతున్నా రని పద్ధతి మార్చుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని లేఖలోహెచ్చరించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు బోదె బోయిన బుచ్చయ్య పెనుమల్ల కృష్ణారెడ్డి గిరిజన యువకులను గ్రూపులుగా ఏర్పాటు చేసి గిరిజనుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఇసుక కాంట్రాక్టర్ల తో డి సి ఓ తో చేతులు కలిపి ఇసుక సొసైటీ ఉన్నచోట మరో సొసైటీ తయారు చేయడానికి డీసివోకు ఒక్కొక్క సొసైటీకి 5. లక్షలు లంచంఇచ్చి కొత్త సొసైటీలను తయారు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఎదురు తిరిగిన యువకులపై మావోయిస్టులకు సహకరిస్తూ ఉన్నారని బనాయిస్తూ పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు అంతేకాక మావోయిస్టుల పేరుతో ఒక్కొక్క ఇసుక ర్యాంపు వద్ద 6 లక్షలు వసూలు చేశారని లేఖలో పేర్కొన్నారు వీరి పద్ధతి మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు మండలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కాంట్రాక్టర్ పనులు చేసుకుంటూ గ్రూపులుగా ఏర్పడి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నారని వారి పద్ధతి మార్చుకోకపోతే శిక్షించక తప్పదని హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు.పిఎల్.జి.ఏ వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ మావోయిస్టు పార్టి. అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వారి దందాలను ఎత్తు చూపుతూ హెచ్చరికల తో లేఖను విడుదల చేయడంతో అధికార పార్టీ నేతలు గుబులు మొదలైంది ఏజెన్సీ ప్రాంతంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురి అవుతున్నారు