Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టిఆర్ఎస్ ఎమ్మెల్యే పి ఏ శివను తక్షణమే అరెస్టు చేయాలి

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ కొండ సురేఖ మురళీధర్ రావు

వరంగల్ డిసెంబర్ 2 నిజం న్యూస్

వరంగల్ తూర్పు నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పిఏ శివ అనే వ్యక్తి ఓ విద్యార్థిని ని అత్యాచారం చేశాడని ఆమె ఫోటోలు తీసుకుని బాధిత మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్సీ *కొండా సురేఖ-మురళీధర్ రావు బాధిత మహిళకు న్యాయం చేయాలని వరంగల్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఈ సందర్భంగా *కొండా సురేఖ- మురళీధర్ రావు మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యే అండతోనే అధికారం ఉందనే అహంకారం తోనే వారి పీఏ ఇలాంటి నీచపు పనులను చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు అరాచకాలు అత్యాచారాలు ఎక్కువయ్యాయని కొండ సురేఖ- మురళీధర్ రావు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత మహిళకు న్యాయం చేకూరే దాకా కాంగ్రెస్ పార్టీ తరఫున కొండా దంపతులు ఎంతటి త్యాగానికైనా వెనకాడబోరని చేతిలో అధికారం ఉందని అధికార బలంతో అక్రమంగా అరెస్టులు చేస్తే భయపడబోమని వరంగల్ తూర్పుఎమ్మెల్యే నరేందర్ పిఎ శివపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత మహిళకు న్యాయం చేకూరేదాకా మా పోరాటం ఆగదనీ కొండా సురేఖ కొనియడడం జరిగింది. కొండ సురేఖ-మురళీధర్ రావు నాయిని రాజేందర్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య అరెస్ట్ చేసి తీసుకెళ్లి విడిచి పెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హనుమకొండ,వరంగల్ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి గారు, సిరిసిల్ల రాజయ్య గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కాంటెస్ట్ కార్పోరేటర్లు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని డివిజన్ల కొండ యువసేన అధ్యక్షులు ,కొండ యువసేన నాయకులు, కొండ అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.