అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి డిసెంబర్ 2 నిజం న్యూస్
హైదరాబాద్ పట్టణంలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాసంలో నూతనకల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి,ఉప్పల్ ఎంకన్న, బొడ్డుపల్లి రాములు, నకరికంటి అర్జున్,రమేష్,జానీ,రవి,శేఖర్,అశోక్, మురళి వారితో పలువురు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో గులాబీ జెండా తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజల ఆకర్షితులై నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. పార్టీలో చేరిన కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు.