Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేశంలోనే నెంబ‌ర్ 1 స్థానంలో సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌

అత్య‌ధిక పీఎల్ఎఫ్ తో దేశంలోనే నెంబ‌ర్ 1 స్థానంలో సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌

-90.86 శాతం పీఎల్ఎఫ్ తో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ విద్యుత్ కేంద్రాల్లో కెల్లా అగ్ర‌స్థానం

-ఉద్యోగుల‌కు సంస్థ ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ అభినంద‌న‌లు

-2026 నాటికి సింగ‌రేణి నుంచి 3 వేల మెగావాట్ల‌కుపైగా థ‌ర్మ‌ల్‌, సోలార్ విద్యుత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసెంబర్ 1 (నిజం న్యూస్)
సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే సుమారు 250 కి పైగా ఉన్న ప్ర‌భుత్వ,ప్రైవేట్ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల క‌న్నా అత్య‌ధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్ట‌ర్ (పీఎల్ ఎఫ్‌) ను సాధించి ఈ ఆర్థిక సంవ‌త్స‌రం న‌వంబ‌రు నాటికి అత్యుత్త‌మ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంగా రికార్డు సృష్టించింది.ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో నవంబ‌రు తో ముగిసిన 8 నెల‌ల కాలంలో అత్యుత్త‌మ సగ‌టు పీఎల్ ఎఫ్ 90.86 శాతం తో ఈ ఘ‌న‌త‌ను సాధించింది. దీనిపై సంస్థ ఛైర్మ‌న్& ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ త‌న హ‌ర్షం ప్ర‌క‌టిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, అధికారుల‌కు త‌న అభినంద‌న‌లు తెలియ‌జేశారు.సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం ప్రారంభించి కేవ‌లం 6 సంవ‌త్స‌రాలే అయిన‌ప్ప‌టికీ మొద‌టి నుంచీ ఈ ప్లాంట్ త‌న అత్యుత్త‌మ పీఎల్ ఎఫ్ తో దేశంలోని 25 అత్యుత్త‌మ ప్లాంట్ల‌ జాబితాలో అగ్ర‌స్థానాల్లో నిలుస్తూ వ‌స్తోంది.2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్వ‌హిస్తున్న థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్త‌మంగా 88.97 శాతం పీఎల్ ఎఫ్ తో మొద‌టి స్థానంలో నిల‌వ‌గా అదే విభాగంలో 2020-21 లో రెండో స్థానంలో నిలిచింది. కాగా, ఈ సారి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల్లో కెల్లా సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం మొద‌టి స్థానంలో ఉండ‌గా ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో గ‌ల‌ ఎన్టీపీసీ కోర్భా సూప‌ర్ ప‌వ‌ర్ థ‌ర్మ‌ల్ స్టేష‌న్ 90.01 శాతం పీఎల్ ఎఫ్ తో రెండో స్థానంలో,ఎన్టీపీసీకే చెందిన‌ సింగ్రౌలి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ 89.94 శాతం పీఎల్ఎఫ్ తో మూడో స్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ ప్ర‌తిభ‌ను చాటింది. నాలుగుసార్లు 100 శాతం పీఎల్ఎఫ్ దాటిన ఎస్టీపీపీ థ‌ర్మ‌ల్ ప్లాంట్‌. 2016 ఆగ‌స్టులో ప్రారంభ‌మైన సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప్లాంట్ ఆది నుంచీ త‌న ప్ర‌తిభ చాటుతూ ఇప్ప‌టికే నాలుసార్లు 100 శాతం పీఎల్ఎఫ్ ను సాధించింది. 2018 సెప్టెంబ‌రు , 2019 ఫిబ్ర‌వ‌రి,2020 ఫిబ్ర‌వ‌రి, 2022 మార్చి నెల‌ల్లో నూటికి పైగా పీఎల్ ఎఫ్ సాధించ‌డం విశేషం. ఈ ప్లాంట్ లో రెండు యూనిట్లు ఉండ‌గా రెండో యూనిట్ ఇప్ప‌టి వ‌ర‌కు 10 సార్లు,ఒక‌ట‌వ యూనిట్ ఏడు సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాట‌డం గ‌మ‌నార్హం.2016 లో ప్రారంభ‌మైన సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు 51,547 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల కోసం గ్రిడ్‌కు అనుసంధానం చేసి నూత‌న రాష్ట్ర ప్ర‌గ‌తిలో త‌న‌వంతు పాత్ర‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తూ వ‌స్తోంది. సింగ‌రేణి ప్లాంట్ పురోగ‌తిని ప్ర‌శంసిస్తూ మ‌రో 800 మెగావాట్ల ప్లాంట్ ను అదే ప్రాంగణంలో నెల‌కొల్పాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదేశించ‌గా ఛైర్మ‌న్ &ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ ప్ర‌త్యేక చొర‌వ‌తో దీని టెండ‌ర్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. దీనికి సంబంధించిన నిర్మాణాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి . అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత‌రం రాష్ట్రంలో సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటు లో ముంద‌డుగు వేసిన తొలి ప్ర‌భుత్వ సంస్థ సింగ‌రేణినే ఇప్ప‌టికే 219 మెగావాట్ల ప్లాంట్ల‌ను విజ‌య‌వంతంగా నెల‌కొల్పింది. మూడో విడుత 81 మెగావాట్ల‌ ప్లాంట్ల ఏర్పాటు లో భాగంగా త్వ‌ర‌లోనే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప్లాంట్ ఆవ‌ర‌ణ లోని నీటి రిజ‌ర్వాయ‌ర్ లో 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తోంది. సింగ‌రేణి థ‌ర్మ‌ల్‌,సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రాష్ట్ర విద్యుత్ అవ‌స‌రాలు తీర్చ‌డంతోపాటు సింగ‌రేణి సంస్థ కు లాభాల‌ను చేకూర్చుతుంది.

 

2026 నాటికి 3 వేల మెగావాట్లకు పైగా విద్యుత్‌ : ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌

ప్ర‌స్తుత 1200 మెగావాట్ల థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రంతో పాటు 2026 నాటికి పూర్తి కానున్న 800 మెగావాట్ల స్టేజ్ -2 ప్లాంట్ మ‌రియు ప్ర‌స్తుత ప్ర‌తిపాదిత 300 మెగావాట్ల సోలార్ విద్యుత్, రాష్ట్ర ప్ర‌భుత్వ వారి అనుమ‌తితో భారీ జ‌లాశ‌యాల‌పై ఏర్పాటు చేయ‌నున్న వెయ్యి మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్‌ల‌తో క‌లిపి మొత్తం 3 వేల మెగావాట్ల‌కు పైగా విద్యుత్ ను అందించేందుకు సింగ‌రేణి సంస్థ ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ముందుకుసాగుతోంద‌ని సింగ‌రేణి ఛైర్మ‌న్ మ‌రియు ఎండీ శ్రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ పేర్కొన్నారు.సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో మొద‌టి స్థానంలో నిల‌వ‌డం ప‌ట్ల త‌న హ‌ర్షం ప్ర‌క‌టిస్తూ ఇదే ప‌నితీరుతో ముందుకు సాగాల‌ని అధికారుల‌కు, ఉద్యోగుల‌కు పిలుపునిచ్చారు.