రోడ్డు పైనే మహిళా ప్రసవం…

రోడ్డు పైనే మహిళా ప్రసవం…
-నెలలు నిండకపోవడంతో పాప మృతి…
– సర్పంచ్ భర్త, బీర్ల ఫౌండేషన్ శ్రమించిన దక్కని ఫలితం..
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో డిసెంబర్ 01(నిజం న్యూస్)
రాజపేట మండలం నమిల మధిర గ్రామం పిట్టలగూడెం మహిళ గురువారం సాయంత్రం ప్రసవించిన తీరు అందరినీ కలచివేసింది.నమిల గ్రామ సర్పంచ్ భర్త మేకల రమేష్ చేసిన కృషి ,ప్రయత్నం, బీర్ల ఫౌండేషన్ వారు చేసిన సహకారం ఫలితం లేకుండా పోయింది..నమిల సర్పంచ్ భర్త రమేష్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..పిట్టలగూడెం కు చెందిన లలితకు ఇద్దరు సంతానం ఉండగా ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి ఉదయం నుండి విరేచనాలకు గురైన సదరు గర్భిణీ నొప్పులు రావడంతో ఆసుపత్రికి వచ్చే క్రమంలో పిట్టలగూడెం లో ఇంటి సమీపంలో రోడ్డుపైనే ప్రసవించింది.అరగంటకు పైగా అలాగే ఉండడంతో ఆ సమయంలో అక్కడికి వచ్చిన సర్పంచ్ మమత భర్త రమేష్ పరిస్థితిని చూసి ఒక్కసారి గా చలించి తన ద్విచక్ర వాహనంపై డెలివరీ అయిన పాపను రాజపేట ఆసుపత్రికి తీసుకొచ్చాడు.రాజపేటలో ఉండాల్సిన అంబులెన్స్ యాదగిరిగుట్ట ఆసుపత్రికి తరలించడంతో తప్పని పరిస్థితుల్లో తల్లి పిల్లలను కాపాడేందుకు బీర్ల ఫౌండేషన్ వాహనాన్ని రప్పించారు.తల్లి పాపను నీలోఫర్ ఆసుపత్రికి తరలించే క్రమంలో భువనగిరి దాటిన తర్వాత పాప మృతి చెందింది. డెలివరీ అయిన పరిస్థితి, పాప మరణించడం పట్ల గ్రామస్తులు ఆవేదనకు లోనయ్యారు.