Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు

లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తాం బెంగూళురు డ్రగ్స్ స్కాం కేసును మూయించింది కేసీఆరే
ఆ కేసును మళ్లీ తిరగదోడాలి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కేసీఆర్ పైనున్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందే
ప్రజల సొమ్మను దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్న కేసీఆర్
ట్విట్టర్ టిల్లు…. మిషన్ భగీరథ నీళ్లేవి ?
డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, రుణమాఫీ, దళిత బంధు హామీలేమైనయ్?
రోడ్లు, నీళ్లు, కనీస సౌకర్యాల్లేక అధ్వాన్నంగా మారిన రాష్ట్రం
హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ ను నిలదీయండి
గ్రామాల అభివ్రుద్ధి నిధులన్నీ కేంద్రానివే
ఒక్క ఓలా గ్రామానికే 3.89 కోట్లకు పైగా నిధులిచ్చిన కేంద్రం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో నిర్మల్ జిల్లా డిసెంబరు 01 (నిజం న్యూస్)
ప్రజల సొమ్మును దోచుకుంటూ వేల కోట్లు దండుకుని లిక్కర్, డ్రగ్స్, పత్తాల దందాల్లో కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు పెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాష్ట్రాన్న దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని, మేనేజ్ చేసి ఆ కేసును మూసివేయించారని అన్నారు. వెంటనే ఆ కేసును మళ్లీ ఓపెన్ చేసి దోషులతోపాటు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం దొంగ దందాలు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ సాకు చూపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…..

• సంవత్సర కాలంగా మీకోసమే పాదయాత్ర చేస్తున్న. ప్రజల దగ్గరకు వెళ్లాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని మోడీ ఆదేశిస్తేనే.. మీ దగ్గరికి వచ్చాను. ఎక్కడికి వెళ్లినా… సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. పేదోడు ప్రధాని అయిన తర్వాతే… ఈ దేశంలో ప్రజలకు న్యాయం జరిగింది.

• మహిళలను దృష్టిలో పెట్టుకుని, స్వచ్ఛభారత్ కింద ఫ్రీగా బాత్రూములు కట్టించింది మోడీ ప్రభుత్వం. ‘ఉజ్వల యోజన’ కింద పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత మోదీదే. ఉచిత బియ్యం ఇస్తున్నది మోదీనే. తెలంగాణకు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద 2,40,000 ఇండ్లను మోడీ మంజూరు చేశారు.

• డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 4 వేల కోట్ల రూపాయలను మోడీ ఇస్తే కెసిఆర్ చేస్తున్నది ఏమిటి? మహారాష్ట్రలో సంవత్సరంలోపు ఇండ్లు కట్టించి, దసరా ఒక్కరోజే… లక్ష మందికి ఇండ్ల పంపిణీ చేశారు. నెల వ్యవధిలో 1,46 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మోదీ ఇచ్చాడు.

• కెసిఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్. ధాన్యం సేకరణ విషయంలో రైతుల దగ్గర నుంచి బ్రోకర్రిజం చేస్తున్న కెసిఆర్ కు పైసలు ఇస్తున్నది మోదీనే. ధాన్యం కొనడానికి కేసీఆర్ ముందుకు రావడం లేదు. వరి వేస్తే ఉరే అన్నడు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు అంటూ… రైతులను ఆగం చేసిండు. ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమే…ఎకరంపై సుమారు రూ.30 వేలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నాడు.

• రైతు బంధు అని, మిగిలిన అన్నిటిని కేసీఆర్ బంద్ చేసిండు.కెసిఆర్ ఇప్పటివరకు రుణమాఫీ కూడా అమలు చేయలేదు. 300 ఎకరాల్లో పంటలు వేసుకుంటూ కేసీఆర్ ఏమో కోటీశ్వరుడు అవుతాడు. రైతులను మాత్రం బికారీలను చేస్తాడు.

• ఈ గ్రామానికి వివిధ పథకాల కింద 3,89,16,570 రూపాయల నిధులు కేంద్రం మంజూరు చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా భారీ ఎత్తున ఇచ్చాం. కేంద్రం ఇస్తున్న నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది అసలు ఈ ఓల గ్రామానికి కేసీఆర్ చేసింది ఏమిటి? ఇక్కడ ఉన్న కెనాల్ ను కూడా ఇప్పటివరకు కేసీఆర్ పూర్తి చేయలేదు.

• ట్విట్టర్ టిల్లు మిషన్ భగీరథ నీళ్లపై అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఇక్కడ నీళ్లు లేవు, ఇండ్లు లేవు… రోడ్లు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. పెన్షన్లు ఇవ్వడం లేదు. తెలంగాణను 5 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా చేసిండు. పుట్టబోయే బిడ్డ నెత్తి పైన లక్ష రూపాయల అప్పు పెట్టిండు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న కేసీఆర్…. ఇప్పటివరకు ఎందుకు పరిష్కరించ లేదు? దళిత బందు, దళితులకు మూడెకరాల భూమి, 2bhk హామీ ఏమైంది?

• ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో కవిత ప్రమేయమున్నది. కెసిఆర్ కుటుంబం వ్యాపారాలు చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయి.. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం పైసలు లేవు. క్యాసినో(పత్తాలు)లో కూడా పెట్టుబడులు పెట్టిండ్రు. ఒక ఆడ ఆమె మద్యం లో పెట్టుబడులు పెడతారా?. తెలంగాణలో పేదోళ్ళు బికారీలు అవుతున్నారు.

• కెసిఆర్ కుటుంబం, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం వేలకోట్లకు ఎదుగుతారు. వేలకోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఓట్ల కోసము రాలేదు. ట్విట్టర్ టిల్లు వచ్చి, ఇక్కడ ఏం పీకుతాడో చూద్దాం.

• లిక్కర్ దందా చేసే వాళ్లను విడిచిపెడదామా? డ్రగ్స్ ను చిన్నపిల్లలకు అలవాటు చేస్తున్న వాళ్లని విడిచిపెడదామా? పత్తాల ఆటలో పెట్టుబడులు పెట్టిన వాళ్లను విడిచిపెడదామా?. కర్ణాటక, బెంగళూరులో డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న 5 గురు పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ పోలీసులతో కలిసి, కేసీఆర్ ఆ కేసును నీరుగార్చారు. కర్ణాటక లో మా ప్రభుత్వం ఉన్నా… ఇక ఏమున్నా కూడా… ఆ కేసును, అందులో ఉన్న వ్యక్తులను బయటికి తెస్తాం. కేసీఆర్ డ్రగ్స్ కేసును కూడా బయటకు తీస్తాం. ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలి. మీకోసం పోరాటం చేస్తున్న. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి
అంతకుముందు గ్రామస్తులు తమ బాధను ఏకరవు పెట్టారు…. అవేమిటంటే…….
బండి సంజయ్ ఎదుట తమ సమస్యలను ఏకరవు పెట్టిన ఓల గ్రామస్తులు…
‘మాకు ఫసల్ బీమా యోజన’ రావడం లేదు – రొడ్డే విఠల్, సూర్యాపురం గ్రామం
2bhk, 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదు – రొడ్డే విఠల్, సూర్యాపురం గ్రామం
మా గ్రామానికి రోడ్డు లేదు… మిషన్ భగీరథనో… భగవద్గీతనో నాకు తెలీదు కానీ, మాకు మాత్రం నీళ్లు రావడం లేదు – ఓ లంబాడీ వృద్ధుడు, అంబుగామ్ గ్రామస్తుడు
100 ఎకరాల పోడు భూమి సమస్య ఉంది – గణేష్, చుట్టుపక్కల గ్రామస్తుడు
ఫారెస్ట్ అధికారులు మా భూమిని స్వాధీనం చేసుకున్నారు – గణేష్, ఓ గ్రామస్తుడు
మా భూమిని మాకు ఇప్పించగలరని విజ్ఞప్తి చేస్తున్నా – గణేష్, ఓ గ్రామస్తుడు
పది సంవత్సరాల నుంచి మాకు కనీసం రోడ్డు కూడా వేయని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొంది – ఓ గ్రామస్తుడి ఆవేదన
ఏ కరప్షను చేయనిది ఒక్క రైతు మాత్రమే – ఓ యువరైతు
ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు – ఓ యువరైతు
అసలు రుణమాఫీ చేయమని అడిగింది ఎవరు? ఈ కరప్షన్ ఎందుకు చేస్తున్నారు? – ఓ యువరైతు
భారత్ ను రక్షిస్తున్న టైగర్ నరేంద్ర మోడీ మాత్రమే – ఓ యువరైతు
కరప్షన్ లేని దేశాన్ని స్థాపించాలన్నదే… ఓ రైతుగా నా కోరిక – ఓ యువరైతు
మాకు దళిత బంధు రాలేదు – ఓ దళిత మహిళ
కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికీ పరిహారం అందలేదు – ఓల గ్రామస్తులు
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం వేసిన బిస్వాల్ కమిటీ చెబితే… ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 30 వేల ఉద్యోగాలు మాత్రమే – నిరుద్యోగ యువత ఆవేదన…