ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తాం… మంత్రి కేటీఆర్

మునుగోడు లో ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశం …..మునుగోడు, డిసెంబర్ 1, (నిజం న్యూస్). ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు గురువారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రులు జగదీశ్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ ప్రశాంత్ రెడ్డి సత్యవతి రాథోడ్, నియోజవర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలతో ఆయన హాజరై మాట్లాడారు. నియోజవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే నిర్ణయం మేరకు ప్రజలకు అనుకూలమైన చోట ఏర్పాటు చేస్తామన్నారు. చండూరు, చౌటుప్పల మున్సిపాలిటీల అభివృద్ధికి 80 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చండూరును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజవర్గంలో ఐదు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గం బాధ్యత కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిదే కాదని తమ సమిష్టి బాధ్యత అంటూ పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 402 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నాలుగు చోట్ల చేనేత క్లస్టర్ను కూడా ఏర్పాటు చేస్తా మన్నరు. గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కు 12 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించి కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకున్నారని. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.