పోస్టల్ బీమా సౌకర్యం పేద ప్రజలకు వరం

ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ వాణి శ్రీకాంత్ రాజ్.
తుంగతుర్తి నవంబర్ 30 నిజం న్యూస్
పోస్టల్ ప్రమాద బీమా సౌకర్యం పేద ప్రజల వరం లాంటిదని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు. వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలో సుమారు 8000 మందికి, ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఆరాధ్య ఫౌండేషన్ స్థాపించి, గ్రామాల్లోని పేద ప్రజలకు సేవలందిస్తున్నాడు తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజల సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. పేద ప్రజలకు సేవనే మా కర్తవ్యం అని అన్నారు. పోస్టల్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేసే, ప్రమాద బీమా సౌకర్యాన్ని పేద ప్రజలకు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోస్టల్ అధికారి గౌని సురేష్ , విజయ్, సురేష్, వెంకన్న, శీను రాములు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.