రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి……..బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 30(నిజం న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టీపీసీసీ మెంబర్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు..ఈ కార్యక్రమంలో బీర్ల అయిలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.అలాగే రాష్ట్రంలో పొడు భూముల సమస్యను పరిష్కరించాలని అలాగే ఇప్పుడు రాష్ట్రంలో రైతులకు రైతుబందు పథకం ఇస్తున్నాం దానితో రైతులు చాలా సంతోశంగా ఉన్నారని అంటున్నారు కానీ రైతుబంధు పథకం వందలు,వేల, ఏకరాలున్న ఈ రైతుబందు పథకం చాలా విధాలుగా సాయపడుతుందని అంతేకానీ నిజంగా వ్యవసాయం చేసుకునే 4,5,ఎకరాలు ఉన్న చిన్నా చితకా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని,ధరణి పోర్టల్ పెట్టి చాలా మందిని ఇబ్బందుల పాలు ఈ ప్రభుత్వం చేస్తుందని అన్నాడు.రేపు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రైతులకు ఏక కాలంలో2లక్షల రూపాయల ఋణమాపి చేస్తుంది.అర్హులందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5లక్షల రూపాయలు ఏకకాలంలో తమ అకౌంట్లో వేస్తుందని అన్నాడు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన దీక్ష చేపట్టిన బీర్ల ఐలయ్య..రాష్ట్రంలో పొడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, ధరణి పోర్టల్ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని,అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూములు ఇవ్వాలని,
రైతుబందు పథకం వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీర్ల ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.గతంలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఏకకాలంలో ఋణమాపి చేసి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు ఉచిత కరెంటుపై సంతకం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని బీర్ల అయిలయ్య*అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమ ఇంచార్జి పసుపుల ప్రభాకర్, రాష్ట్ర,టీపీసీసీ మెంబర్ అండెం సంజీవ రెడ్డి,టీపీసీసీ కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డీ,రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి,జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ,ఎంపీపీ గంధమల్ల అశోక్,జిల్లా నాయకులు ఈరసరపు యాదగిరి,ఆలేరు మండల అధ్యక్షులు కొడ్రారాజు వెంకటరాజు, టౌన్ అధ్యక్షులు ఎంఏ ఏజజ్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కానుగు బాలరాజు,ఆత్మకూరు మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి,తుర్కపల్లి మండల అధ్యక్షులు శంకర్ నాయక్, రాజపేట మండల అధ్యక్షులు మహేందర్ గౌడ్,మాజీ ఎంపీటీసీ జైనుద్దీన్, సింగిల్ విండో డైరెక్టర్ సాగర్ రెడ్డీ, ఆలేరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి సాగర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నందరాజు గౌడ జిల్లా, మండలాల,పట్టణల, నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.