నియోజవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ప్రవీణ్ శర్మ

చండూరు, నవంబర్ 30, (నిజం న్యూస్), మునుగోడు నియోజకవర్గ స్థాయి బ్రాహ్మణ సంఘం సమావేశాన్ని దేవులమ్మ నాగారంలో బుధవారం నిర్వహించి నూతన కమిటీని నియామకం చేశారు. అధ్యక్షుడిగా చండూరుకు చెందిన చిరువెల్లి ప్రవీణ్ శర్మను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా మాడ పాపయ్య శర్మ ఉపాధ్యక్షుడిగా పెద్ది శ్రీధర్ శర్మ, కోశాధికారిగా వేమవరపు వెంకటరమణ శర్మ, ప్రచార కార్యదర్శిగా మాడ వెంకటరమణ శర్మను ఎన్నుకున్నారు .ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ అంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా స్థానికులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.