జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయికి ఎంపికైన శ్రీ రామకృష్ణ విద్యాలయ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్30(నిజం న్యూస్)
బుధవారంనాడు భువనగిరిలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ యాదాద్రి భువనగిరి సౌజన్యంతో జిల్లా స్థాయిలో నిర్వహించిన 30వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ -2022 లో ఆలేరు శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు దొంతిరి శివకార్తీక్ రెడ్డి మరియు అతని సహాయకుడు మెరుగు భగత్ ప్రదర్శించిన “ఫ్లోటింగ్ హౌజ్” (తేలియాడు ఇల్లు) ప్రాజెక్ట్ “మొదటి ఉత్తమ ప్రాజెక్ట్” గా రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బండిరాజుల శంకర్ తెలిపారు..ఈ సందర్భంగా విద్యార్థులను మరియు గైడ్ టీచర్ ఎ.ప్రసన్నలక్ష్మిని జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ కె. నారాయణ రెడ్డి, కరస్పాండెంట్ బండిరాజుల శంకర్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.