కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో నవంబర్ 30(నిజం న్యూస్)
యాదాద్రి జిల్లా రాజపేట మండలం పాముకుంటా గ్రామం,మధిర కషాగూడెం నుండి సుమారు 100మంది కాంగ్రెస్ పార్టీ లోకి టీపీసీసీ మేంబర్-ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. బీర్ల అయిలయ్య పార్టీ కండువా కప్పి పార్టలోకి ఆహ్వానించారు..ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ..కషాగూడెం నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ లోకి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.తెలంగాణ వచ్చిన ప్రభుత్వం 9 సంవత్సరాల నుండి మన రాజపేట లో గాని నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని ప్రజల వ్యతిరేకత ఆలేరు ఎమ్మెల్యే కు ఉండటం తో.. ఆలేరు లో ఒడిపోతున్నాం అనే సంకేతం రావటం తో అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తు,భయపెట్టి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనుగోలు చేద్దామని అనుకుంటూన్నారని తెలిపారు.తప్పకుండా మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు..ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లోకి చేరినవారు మాట్లాడుతూ ఆలేరు లో అయిలన్న చేస్తున్న సేవ కార్యక్రమలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి చేరామని అన్నారు ఆలేరు లో ఎమ్మెల్యే గా అయిలన్నను గెలిపించుకుంటమని అన్నారు.పార్టీ లో చేరినవారిలో ఎస్ కె.అబ్దుల్, చాంద్ పాషా,మదర్,జాంగిర్,ఇసాక్,నూరు పాషా,ఎండి మదర్,కరీం,ఆలీ, ఎస్ కె కరీం,అస్లాం,బాబు,మోహిం,చిన్న జంగిర్,కసిమ్,జమాల్,ఆసాన్,హుసేన్,రజినీకాంత్,గుంశావలి,ఎండి బడేమియా,మదిర్,కరీం, బడేసాబ్,బాబు,పాషా,రహీం,హిమామ్,బాబు ఇంకా తదితరులు కాంగ్రెస్ పార్టీ లోకి రాజపేట మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షుడు పాండు,యువ నాయకుడు ఇంజ నరేష్,ఆధ్వర్యంలో చేరారు.