కన్యకా పరమేశ్వరి గుడి కూల్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల డిమాండ్.
తుంగతుర్తి నవంబర్ 30 నిజం న్యూస్
వనపర్తి లో ఆర్యవైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరి గుడిని, కావాలని కూల్చిన వారిపై చట్టరీత్యా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు బుధవారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన తెలిపి, చట్టరిత్రా క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు సంగం నాయకులు మాట్లాడుతూ ప్రాచీన పూర్వకాలం నాటి కన్యకా పరమేశ్వరి గుడిని, కావాలనే అధికారులు గుడిని కూల్చడం హేయమైన చర్య అని అన్నారు. తక్షణమే జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరిపించి, అధికారులపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని కోరారు. ఆర్యవైశ్యుల కుల దేవత అయిన కన్యకా పరమేశ్వరి గుడిని ముట్టుకుంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా రాజకీయ చైర్మన్ తాటికొండ సీతయ్య ఉపాధ్యక్షులు ఓరుగంటి సత్యనారాయణ కార్యదర్శి బండారు దయాకర్ తుంగతుర్తి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్, కోశాధికారి మాసెట్టి వెంకన్న, భువన కమిటీ అధ్యక్షులు పాలవరపు సంతోష్, ఉపాధ్యక్షులు మాసెట్టి సోమయ్య, ఓరుగంటి అశోక్, తల్లాడ కేదారి, బిక్షం, శ్రీనివాస్, శ్రీహరి, బుద్ధ వీరన్న, తల్లాడ నారాయణ, వెంకన్న, సోమన్న, కృష్ణమూర్తి, తల్లాడ సురేష్, ఓరుగంటి సుభాష్, మహిళా అధ్యక్షురాలు సూర్య కళ, పద్మ, సులోచన, విజయ, తదితరులు పాల్గొన్నారు.