శాంతి భద్రతల కోసమే కాటన్ సెర్చ్

ధ్రువీకరణలను పరిశీలిస్తున్న పోలీసులు.

తుర్కపల్లి, నవంబర్ 29(నిజం న్యూస్) :

శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏసిపి కోట్ల నరసింహారెడ్డి తెలిపారు.మండల కేంద్రములో మంగళవారం సాయంత్రం కాటన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటినీ పోలీసులు తనిఖీలు నిర్వహించి.శాంతిభద్రలు పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా . చౌటుప్పల్, బోనగిరి, యాదగిరిగుట్ట, సిఐలు లతోపాటు 11 మంది ఎస్సైలు 157 మంది పోలీసులు సిబ్బంది తో కలసి గ్రామాలలో శాంతి భద్రతల కోసం రాచకొండ జిల్లా డీసీపీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు కాటన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో అనుమానితులుగా ఇద్దరూ, రౌడీషీటర్స్ నాలుగురు వ్యక్తులును గుర్తించి అదుపులోనికి తీసుకొన్నారు.ఎవరైనా అనుమానితులు కన్పిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాల్లు 42, ఫోర్ వీలర్స్ 1 సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి ఎస్సై రాఘవేందర్ గౌడ్,ఏడు మండలాల ఎస్ఐలు, పదిమంది ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు బ్రిటాలియన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.