అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

మాడ్గుల నవంబర్ 29( నిజం న్యూస్): మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామపంచాయతీలోని ఆబిటేషన్ విలేజ్ రెడ్డి పురానికి చెందిన కాస జోజి రెడ్డి (టిప్పర్ ఓనర్), డ్రైవర్ మొగులాల్ మంగళవారం తెల్లవారు జామున ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్కపల్లి శివారులోని డిండి కాల్వ పక్కన నిల్వ ఉన్న మొరం మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడని డిండి కాల్వ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వి హనుమాన్ ప్రసాద్ ఫిర్యాదు చేయగా అట్టి టిప్పర్ నెంబర్ టి ఎస్ 08 యుబి 8287 వాహనాన్ని స్వాధీనం చేసుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సి ఐ,డి కృష్ణమోహన్ తెలిపారు.