రోడ్డు ప్రమాదంలో.ఓ యువకుడు మృతి… ఇద్దరికీ తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

చర్ల నవంబర్ 29 (నిజం న్యూస్) మండలంలోని ఎదిర గుట్టల వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం చర్ల నుండి ద్విచక్ర వాహనంపై కొర్స. సునీల్. గోగు నవీన్. పర్షిక సురేష్ వెళ్తుండగా ఎగిరగుట్టల సమీపంలో వెంకటాపురం నుండి వస్తున్న నెంబర్ టీఎస్ 25 టి 56 92గల మినీ ధాన్యం లారీ ఢీకొట్టడంతో కొర్స సునీల్. అక్కడికక్కడే మృతి చెందగా గోగు నవీన్ ను కొయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి. పర్షిక సురేష్ ను ఎదుర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొయ్యూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోగు నవీన్ పరిస్థితి విషమించడంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని విచారణ చేసి కేసు నమోదు చేశారు