ఘనంగా స్మాల్ అండ్ మీడియం పేపర్స్ ప్రెస్ క్లబ్ మొదటి వార్షికోత్సవం వేడుక .

హుజూర్ నగర్ నవంబర్ 29 (నిజం న్యూస్)
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం స్మాల్ మీడియం పేపర్స్ ప్రెస్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం సంబరాలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది అనంతరం అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు,కోశాధికారులకు కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు షేక్ నవాబ్ జానీ అధ్యక్షులు షేక్ సైదా ఉపాధ్యక్షుడు జెట్టి తేజస్,జనరల్ సెక్రటరీ నందిగామ నాగేందర్,జాయింట్ సెక్రటరీ షేక్ నాగుల్ మీరా,ట్రెజరర్
గొట్టె నాగరాజు యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ శ్రీరాముల ఆంజనేయులు, దేవరం రామకృష్ణారెడ్డి కొత్తపల్లి మధు, కుక్కల మధుబాబు, గౌతమ్, కలకుంట్ల సైదులు, అమరారపు జలంధర్ బండి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు