ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చేందుకు కృషి….. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
… చండూరు, నిజంన్యూస్,చండూరులో సమీక్ష సమావేశం…… తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. చండూరులో ఆయన మంగళవారం అధికారులు, మున్సిపాలిటీ పాలకవర్గం, ప్రజలతో కలిసి ఓ ఫంక్షన్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. చండూరులో ఇప్పుడున్న ఆరు పడకల ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా మారుస్తామని ఇప్పుడున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనంగా ఆరుగదులు నిర్మిస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణ చేపట్టడంతో పాటు డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామన్నారు ఎట్టి పరిస్థితుల్లో చండూరు మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు ప్రభుత్వ పథకాల కోసం ఎవరికీ లంచం ఇవ్వద్దని మధ్యవర్తులను ఆశ్రయించొద్దంటూ సూచించారు. చండూరులో కోర్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాల్ని మహిళా మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంగడిపేటలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అంగడిపేట లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. పట్టణంలోని చౌరస్తాకు సమీపంలో ఉన్న సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన ఎకరం భూమిలో సమీకృత మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, వైస్ చైర్ పర్సన్ దోటి సుజాత వెంకన్న, కమిషనర్ మణికరన్, కౌన్సిలర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు