కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి , ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర యాదగిరి,సంగెం సర్పంచ్ ఏశమల్ల సుశీల సామేలు, యువ నాయకుడు సృజన్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
తుంగతుర్తి నవంబర్ 29 నిజం న్యూస్
హైదరాబాద్ పట్టణంలోని మంత్రుల నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎర్ర యాదగిరి, ఫణిగిరి గ్రామ ఉప సర్పంచ్ ఎర్ర నరేష్, వార్డు మెంబర్లు ఉపేంద్ర, బెల్లం శారద, నాగారం మండల యూత్ అధ్యక్షుడు ఎర్ర బాబు, యూత్ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర అంబేద్కర్ మరియు సంగెం గ్రామ సర్పంచ్ ఏశమల్ల సుశీల సామేలు, కాంగ్రెస్ యూత్ నాయకులు సృజన్ ,సుధీర్, రామచంద్రు,శ్రీనివాస్ కొత్తపల్లి వార్డు మెంబర్లు సంకటి మల్లయ్య, బూడిద నర్సయ్య, సంకటి శ్రీను, మాజీ ఉప సర్పంచ్ బూడిద సాయిలు,రావుల శంకర్,సైదులు మరియు ఇటుకులపహాడ్ గ్రామం నుండి చిగుట సైదులు, విద్యా కమిటీ చైర్మెన్ అంబటి రమేష్ వారితో పాటు 500 మంది నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, డి సిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.