ఆ ఆసుపత్రులను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు

నిజామాబాద్ రూరల్ నవంబర్ 28, (నిజం న్యూస్ ):
శాశ్వత ప్రాతిపదికన గైనకాలజిస్టు వైద్యులను నియమించుకోకుండా సిజేరియన్ లు చేస్తున్న ఆసుపత్రులను సీజ్ చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లో మాట్లాడుతూ అవసరం లేకపోయినా సిజీరియన్ కాన్పులు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక పరిశీలక బృందాలు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.