ఇసుక, మొరం అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలి: కలెక్టర్

నిజామాబాద్ రూరల్ నవంబర్ 28, (నిజం న్యూస్ ):
ఇసుక, మొరం అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా గట్టి నిఘా ఉంచాలని, అదే సమయంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన అధికారులతో సమీక్ష జరిపి మాట్లాడుతూ ప్రభుత్వానికి నిర్దేశిత సీనరేజ్ చెల్లించి ఇసుక, మొరం తరలించేందుకు అనుమతించాలన్నారు. నిబంధనలు పక్కాగా అమలయ్యే లా చూడాలని, ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని, సెలవు దినాల్లో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిషేధించాలని
కలెక్టర్ సూచించారు.