శాస్త్ర విద్యాసాధనకై పోరాడుదాం….జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ రావు

బోధన్ సెప్టెంబర్ 26 (నిజం న్యూస్ )

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోధన్ పట్టణంలోని మహర్బా ఫంక్షనల్ జిల్లా 22వ మహాసభను నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభ ప్రారంభానికి ముందు సంస్థ చిహ్నమైన బిగిపిడికిలి జెండాను జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ ఆవిష్కరించారు అనంతరం మహాసభను ప్రారంభించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ రావు గారు హాజరై వారు మాట్లాడుతూ విద్యార్థులు అశాస్త్రీయ భావజాలాన్ని విడనాడి శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ప్రజలను పాలకులు మూఢవిశ్వాసాలతో ముంచి వారి పబ్బం గడుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు , విద్యార్థులు తగిన చైతన్యంతో సైన్స్ నీ నమ్ముకోవాలని సూచించారు
మరొక వక్త జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ అనుకున్న లక్ష సాధనకై నిరంతరం కృషి చేయాలని ముఖ్యంగా గుట్టుక మధ్యము పొగాకు లాంటి కి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సి పి ఎం (ఎల్ యు )న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ తెలంగాణ సాధనలో విద్యార్థుల పాత్ర మరువలేనిదని విద్యార్థుల త్యాగాల మీదనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు విద్యార్థుల త్యాగాల మీద గద్దెనెక్కిన టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు వెంటనే ప్రభుత్వం పూనుకోవాలని తెలిపారు విద్యారంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపుల్లో సరిపడా న్యాయం చేయట్లేదని విద్యా రంగాన్ని ప్రైవేటు కార్పోరేట్ రంగాలకు అప్పజెప్పే పనిలో ఉన్నారని ఆవేదన వ్యక్తపరిచారు వెంటనే పాలకులు విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగేలా అందుకు తగిన నిధులు కేటాయించేలా ఉండాలని లేనిపక్షంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జి నడిపి భూమయ్య ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్. గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు నడిపింటి కార్తీక్, సాయి కృష్ణ, సహాయ కార్యదర్శి సంతోష్ , ప్రిన్స్, కోశాధికారి పవన్, లతోపాటు జిల్లా నాయకులు సాయినాథ్ , మహేందర్ , దేవిక. మరియు 200 మంది ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.