టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నిజామాబాద్ రూరల్ నవంబర్ 28, (నిజం న్యూస్ ): పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం టిఎన్ఎస్ఎఫ్ అధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిపారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్షిప్ బకాయిలు దాదాపు 3300 కోట్లు నిధులు విడుదల చేయక విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఫీజు బకాయిల మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని, గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో, వివిధ కోర్సులను పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి ఉప ఎన్నికల మీదున్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని అన్నారు.