మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ట్రాఫిక్ సీఐ

నిజామాబాద్ రూరల్ నవంబర్ 28, (నిజం న్యూస్ ): మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి నగరంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13 కేసుల్లోని వ్యక్తులు, వారి సంబంధీకులకు సోమవారం నగరంలోని టిటిఐ కేంద్రంలో సీఐ కౌన్సెలింగ్ నిర్వహించి మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలు వివరించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీఐ సూచించారు. మరోమారు పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.