సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే

టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. గుజ్జ యుగంధర్ రావు
తుంగతుర్తి, నవంబర్ 28 నిజం న్యూస్
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు అన్నారు. సోమవారం పూలే 133వ వర్ధంతి వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలోని పూలే నిలువెత్తు విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అంటూ ఫూలే సేవలను గుర్తు చేసుకున్నారు
. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకు సృజనా పరమేష్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, ఎల్ల బోయిన బిక్షం, పులుసు వెంకటనారాయణ గౌడ్, గునుగంటి సంతోష్,తడకమల్ల రవికుమార్, మల్లెపాక వెంకన్న, నాగమల్లు, వంశి గౌడ్, జలంధర్, బొంకూరి మధు, ఆకారపు భాస్కర్, మహేష్, మంగళపల్లి ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.