క్రీడలకు కేంద్రంగా మైత్రి మైదానం

ఘనంగా ముగిసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్

లక్ష 75 వేల రూపాయల నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరువు నవంబర్ 27 (నిజం న్యూస్)

దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి స్టేడియంలో సంవత్సరం పొడవున వివిధ అంశాల్లో క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

కేబీఎన్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్ చెరువు పట్టణంలోని మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు సొంత నిధులతో లక్ష 75 వేల రూపాయల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీ లు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని కోరారు. పటాన్ చెరువు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. స్వతహా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని తెలిపారు. మైత్రి స్టేడియాని ఏడు కోట్ల రూపాయలతో పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మెరాజ్ ఖాన్, కృష్ణమా చారి, క్రీడాకారులు పాల్గొన్నారు