పట్టా భూమిపై ఆందోళనలు సరికాదు

ప్రభుత్వ భూమిలో పట్టాలు చట్ట విరుద్ధం: జిఎస్ఎస్ రాష్ట్ర కన్వీనర్ బాడిష బిక్షం
ములకలపల్లి నవంబర్ ( నిజం న్యూస్) 26:
పూసుగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో సమస్యాత్మకంగా మారిన 241/1 సర్వే నంబర్ లోని 40 ఎకరాల భూమిపై వారసులమని చెప్తున్న మొహమ్మద్ షబీర్ అహ్మద్ మరియు వారి కుటుంబ సభ్యులు ములకలపల్లి మండలం కేంద్రంలో ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించారు. కోర్టు ఇది ప్రభుత్వ భూమి కాదు పక్కా పట్టా భూమి అని, భూ యజమానులు కాకుండా ఇతరులు ఎవరూ కూడా భూమిలోకి ప్రవేశించరాదని తీర్పు చెప్పిందని ఈ యొక్క తీర్పు 24వ తేదీన భద్రాచలం మొబైల్ కోర్టు వారిచే జారీ చేయబడిందని తెలిపారు. దీనికి సంభంధించిన పూర్తి ఆధారాలు మావద్ధ ఉన్నాయని వీటన్నిటినీ కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారు ఇచ్చిన స్టేటస్కో రద్దు కోసము హైకోర్టులో యజమానులమైన మేము పిటిషన్ దాఖలు చేసినామని తెలిపారు. దీనిపై గౌరవ హైకోర్టు వారు వచ్చే నెల 2 వ తేదీన విచారణ జరిపి తుది తీర్పు ఇవ్వనున్నారని స్టేటస్కో అప్పటివరకు మాత్రమే వర్తింస్తుందని తెలియజేసినారు.
ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై హక్కులు గిరిజనులవే: జిఎస్ఎస్ రాష్ట్ర కన్వీనర్ బాడిష బిక్షం
అయితే గిరిజన సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ భాడిష బిక్షం నిజం న్యూస్ కు వివరణ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వారికి సధరు ప్రభుత్వ భూమిని అక్రమించి చట్ట విరుద్ధంగా పట్టాలు పొందిన గిరిజనేతరులు సరైన ఆధారాలు సమర్పించని కారణంగానే తదుపరి వాయిదా వచ్చే నెల 2వ తేదీకి వేయడం జరిగిందని అంతేగాని ఇప్పటివరకు గిరిజనులకు వ్యతిరేకంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయబడలేదని అన్నారు. సర్వే నంబరు 241/1 లోని 40 ఎకరాల భూమి ఖచ్చితంగా ప్రభుత్వానికి చెందినదేనని అందుకే గిరిజన సోదరులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎంతమంది కబ్జాదారులు అవినీతిపరులైన అధికారులు అడ్డంకులు సృష్టించినా వెనక్కు తగ్గేది లేదని అందరం ఐకమత్యంగా పోరాడితే విజయం సాధించడం తధ్యమని ఉద్గాటించారు.