రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా మరియు మండల అధ్యక్ష కార్యదర్శులకు ఘనంగా సన్మానం

సూర్యాపేట ప్రతినిధి నవంబర్ 26 నిజం న్యూస్
రిటైర్డ్ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం జిల్లా మరియు మండల నూతన అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గ సమావేశాన్ని శనివారం రోజున సూర్యాపేటలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చేయుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులు సామాజిక సేవలో రాణించాలని కోరారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి సెక్రటరీ బొల్లు రాంబాబు రాష్ట్ర నాయకులు సీతారామయ్య ఓరుగంటి సత్యనారాయణ, రవీందర్ రెడ్డి ,పాలవరపు సంతోష్, పుల్లయ్య తదితరు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు