జాన్ పహాడ్ సైదులు బాబా దర్గా వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలో వక్స్ బోర్డ్ అధికారులు విఫలం

గిరిజన శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు నాయక్
పాలక వీడు నవంబర్ 26(నిజం న్యూస్)
పాలక వీడు మండల పరిధిలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న జాన్ పహాడ్ సైదులు బాబా దర్గాను గిరిజన శక్తి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కేళవత్ మధు నాయక్ శనివారం దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 సంవత్సరాలు చరిత్ర కలిగిన జాన్ పహాడ్ దర్గా వద్ద మౌలిక సదుపాయాలు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నోసార్లు వక్స్ బోర్డ్ మరియు ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు వినతి పత్రాలు ఇచ్చిన ఉపయోగం లేదన్నారు వక్స్ బోర్డ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు ఇక్కడ వచ్చిన ఆదాయంలో 40 శాతం దర్గా వద్ద మౌలిక సదుపాయాల కొరకు కేటాయించాలని కోరారు ఈ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు తమ సొంత లాభానికి పాల్పడుతున్నారని అన్నారు ఈ మండల ఓట్లతో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజా ప్రతినిధులైన నాయకులు వచ్చి బాబా దర్శనం చేసుకుని వెళ్తారు తప్ప ఏనాడైనా ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలని ఆలోచన రాలేదన్నారు ఎమ్మెల్యే ఎంపీల నిధులతో మరుగుదొడ్లను మరియు స్నాన గదులను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు