టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు తరలి రావాలి

టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు తరలి రావాలి
ఆలేరు నవంబర్ 26 (నిజం న్యూస్)
హైదరాబాద్ ఆర్టీసీ కళా నిలయం లో 27న జరుగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ద్వితీయ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పేరబోయిన నర్సింహులు మరియు ప్రధాన కార్యదర్శి ముత్యాల జలంధర్ లు పిలుపునిచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని స్థానిక రహదారి బంగ్లా వద్ద యూనియన్ మహాసభల ప్రచారంలో భాగంగా ఆలేరులో విలేకరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కొరకు వారి సమస్యల సాధన కొరకు టీడబ్ల్యూజేఎఫ్ అనునిత్యం పోరాడుతుందని అన్నారు.నిత్యం విలేకరుల పై జరుగుతున్న దాడులు ఆకృత్యాల పై వాటి నివారణ కోరకు ఇండ్లు ఇళ్ల స్థలాల సాధన కు రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు.ఈ సభలకు జిల్లా వ్యాపితంగా గల జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఆదివారం నాడు ఉదయం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి భారీ ప్రదర్శన గా వెళ్లి ఆర్టీసీ కళా వేదిక లో సభ జరగనున్నట్లు తెలిపారు.ఈ సభల ప్రారంభం కు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారని తెలంగాణ వ్యాపితంగా వివిధ జిల్లాల నుండి ఎంపిక చేయబడిన ప్రతినిధులు హాజరువుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మోరిగాడి మహేష్,జిల్లా సహయ కార్యదర్శి దాసి శంకర్,కమిటీ సభ్యులు ఎలుగల కుమారస్వామి,నాయకులు కుల్ల సుద్దులు, బి రవికుమార్, గంగదారి శ్రావణ్ కుమార్,ఎల్లంల వెంకటేష్ యాదవ్, వంగరి శివ కుమార్, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.