టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అడ్డగుడూర్ నవంబర్ 26(నిజం న్యూస్)
అడ్డగూడూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దర్శనాలు అంజయ్య, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మోత్కూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, సీనియర్ జిల్లా నాయకులు శ్రీరాముల అయోధ్య, ప్రధాన కార్యదర్శి సత్యం గౌడ్, మండల పార్టీ యువజన అధ్యక్షుడు లింగాల అశోక్ గౌడ్, మోత్కూర్ మాజీ మార్కెట్ డైరెక్టర్ పూలపల్లి జనార్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, విద్యార్ధి విభాగం నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు