తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ….నాకే ఇవ్వాలి

మాజీ గిడ్డంగుల చైర్మన్, మందుల .సామెల్
కేసీఆర్ కు చేతులెత్తి మొక్కిన,….. సామెల్.
సూర్యాపేట జిల్లా ప్రతినిధి, నవంబర్ 26 నిజం న్యూస్.
నల్గొండ జిల్లా ,శాలిగౌరారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి, సంచలన విషయాలు వెల్లడించారు..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రారంభం నుండి కేసీఆర్ వెంటే నడిచానని ,టిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం తెలంగాణ వాదం భావవ్యక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించాలని ఆయన తెలిపారు.
2013 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోనే తుంగతుర్తి నియోజకవర్గంలో 40 మంది సర్పంచ్ ను గెలిపించి టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేశానని ఆయన తెలిపారు.
2001లో తెలంగాణ కోసం మోత్కూరు జెడ్పిటిసి గా పోటీ చేసి 8000 ఓట్లు సాధించాలని ఆయన పేర్కొన్నారు.టిఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాష్ట్రంలో 45 నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జిగా పనిచేశానని, ఉద్యమంలో అనేక కష్టాలు అనుభవించాలని ఆయన తెలిపారు..తన హయాంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగా రెండుసార్లు నియోజకవర్గానికి తీసుకొచ్చానని ఆయన తెలిపారు
తన హయాంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా రెండుసార్లు నియోజకవర్గానికి తీసుకొచ్చానని ఆయన తెలిపారు.తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారని కెసిఆర్ ఆలోచించి రాబోవు ఎన్నికల్లో తనకే టికెట్ కేటాయించాలని ఆయన కోరారు..
వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో టిఆర్ఎస్ పార్టీ గెలవాలంటే, తనకు టిఆర్ఎస్ పార్టీ తరఫున సీటు కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ , ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్ ,జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి లకు విజ్ఞప్తి చేశారు.. ఈ సమావేశంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.