గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై రేపు ఉచిత శిక్షణ

మర్రిగూడ, నవంబర్ 26 (నిజం న్యూస్)
గ్రామ భారతి సంస్థ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలోని కృషి వనంలో ఆదివారం,నవంబర్ 27 నాడు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా గ్రామ భారతి ప్రధాన కార్యదర్శి పలుస కరుణాకర్ గౌడ్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పీవీ రావు గారు పాల్గొంటున్నట్లుగా తెలిపారు. సేంద్రీయ ఎరువులు,కషాయముల తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఆసక్తి కలిగిన వారు పేర్లు నమోదుకు 8691293388,9603985866 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.