Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సార్వత్రిక ఎన్నికలపైన ఆశావహుల ఆశలు

అవకాశం కోసం కాసుకున్న టిఆర్ఎస్ బీసీ నేతలు ..! చండూర, నిజం న్యూస్, తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందని ప్రచారం నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలను మర్చిపోకముందుకే సార్వత్రిక ఎన్నికల పైన అందరి దృష్టిపడింది. ముఖ్యంగా ఈసారి బీసీ వాదం గట్టిగా వస్తే తమకు అవకాశం వస్తుందని టిఆర్ఎస్ కు చెందిన బీసీ నేతలు కొందరు గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అపుడే క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకుల బలబలాలు , ప్రజల్లో వారికి ఉన్న పేరు , మైనస్ లు ఏంటనే విషయాలను కూడా ఇటీవల పార్టీ సర్వే చేయించినట్లుగా ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సీఎం కేసీఆర్ ఇటీవల సిట్టింగ్ లోకే మళ్ళీ అవకాశం ఇస్తానని ప్రకటించడం కూడా ఆశావాలను కలవరపరుస్తోంది. తాజా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సైతం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగాలని గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.