వర్డ్ అండ్ డిడ్ స్కూల్ విద్యార్థి బాక్సింగ్ లో గోల్డ్ మెడల్

మిర్యాలగూడ నవంబర్ 24.(నిజంన్యూస్): నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం లో వర్డ్ అండ్ డీడ్ స్కూల్ విద్యార్థి ఏర్పుల కోహిలి హాసన్ నవంబర్ నెల లో పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన సబ్ జూనియర్ బాక్సింగ్ నేషనల్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు.ఈ సందర్భంగా గురువారం పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాఠశాల చైర్మన్ వంగాల నిరంజన్ రెడ్డి-పుష్పలతలు అభినందించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రాగిరెడ్డి నవీన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వారు అన్నారు.కేవలం విద్యార్థులకు చదువుతోపాటు కరాటే,బాక్సింగ్ వంటి శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు.కేవలం విద్యార్థులు చదువుతోపాటు తమను తాము రక్షించుకునేందుకు ఆటలు దోహదపడతాయని వారన్నారు. స్కూల్ స్థాపించినప్పటి నుండి మా విద్యార్థులు ఆటల్లో స్వర్ణ,వెండి పథకాలు సాధించినట్లు వారన్నారు. బాక్సింగ్ కోచ్ ఇరి వెంటి రవీందర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మిర్యాలగూడలో బాక్సింగ్ నేర్పిస్తున్నట్లు వారు అన్నారు.