యాదాద్రి స్వామివారి హుండీ ఆదాయం రూ.1.88 కోట్లు

యాదాద్రి యాదగిరిగుట్ట (నవంబర్ 24 నిజం న్యూస్) యాదాద్రి శ్రీ నరసింహస్వామి వారి భక్తుల కానుక రూపంలో వచ్చిన 15 రోజుల హుండీ ఆదాయం గురువారం ఆలయ అధికారులు భద్రతా సిబ్బంది సమక్షంలో లెక్కించారు. నగదు రూ.188.28.754. మిశ్రమ బంగారం 70 గ్రాములు.మిశ్రమ వెండి 3 కేజీ 600 గ్రాములు. విదేశీ కరెన్సీ రూపంలో అమెరికా 330 డాలర్లు UAE 5. సింగపూర్ 62 డాలర్య్.మలేషియా 50. న్యూజిలాండ్ 50.నేపాల్200 స్వామివారి ఖజానాకు ఆదాయం సమకూరిందని ఈఓ గీతా రెడ్డి  వెల్లడించారు