ప్రేమ వేధింపులకు కస్తూర్బా పాఠశాల యువతి బలి

.కస్తూర్బా పాఠశాలలోని విద్యార్థిని మధుమతి.

తిరుమలగిరి సాగర్ నవంబర్ 24 (నిజం న్యూసు)

ఫిర్యాదురాలు పాల్తీ లక్ష్మీ  సుంకిశాల తండా కుమార్తె/పాల్తి మధుమతి, వయస్సు 16 సం.లు హాలియాలోని కష్టూర్భా గాంధీ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. కొన్ని నెలలుగా, ఆమె సెలవుల సమయంలో వారి ఇంటికి వెళ్లినప్పుడు, వారి గ్రామస్థుడు రమావత్ జైరామ్ తండ్రి మంగ్తా, వయస్సు: 23 సంవత్సరాలు ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. తేదీ 22.11.2022 రాత్రి వేళల్లో, ఆమె తన తల్లితో ఏడుస్తూ అదే విషయాన్ని వెల్లడించింది. తరువాత 23.11.2022 ఉదయం 04.00 గంటల సమయంలో రమావత్ జైరామ్ వేధింపులకు విసిగిపోయి పురుగుమందు తాగింది. అనంతరం ఆమెను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈరోజు అంటే 24.11.2022న ఆమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. పిటిషన్‌లోని అంశాల ప్రకారం, రమావత్ జైరామ్ పై కేసు నమోదు చేసి దహర్యాప్తు ప్రారంబించనైనది