క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగండి .. ఓ ఎస్ డి సాయి మనోహర్

చర్ల,నవంబర్ 23(నిజం న్యూస్) చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరిగిన వాలీబాల్ టోర్నీ బుధవారం రాత్రిలో ముగిసింది. ఫ్లడ్ లైట్ కాంతుల్లో ఉత్సాహంగా సాగిన ఈ క్రీడా పోటీల్లో విజేతలకు ఓఎస్డి సాయి మనోహర్ అందజేశారు… క్రీడా పోటీల ముగింపు సభ సీఐ అశోక్ అధ్యక్షతన జరిగింది

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓఎస్డి మాట్లాడుతూ మన్యం యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు. చిన్ననాడు 40 ఏళ్ల క్రితం చూసిన క్రీడలను ఇప్పుడు చూడటం ఆనందకరంగా ఉందన్నారు. పోటీ తత్వంతో ముందుకు సాగడం ద్వారా క్రీడాకారులు విజయాలు సిద్ధించుకోగలుగుతారని ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యా వైద్యం క్రీడల పట్ల ఎల్లప్పుడు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఫైనల్ మ్యాచ్లో మామిడిగూడెం చీమలపాడు జట్టు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో మామిడిగూడెం జట్టు విజేతగా నిలిచింది. గెలుపొందిన జట్లకు ఓ ఎస్ డి సాయి మనోహర్ ట్రోపీలను అందించారు. ఘనంగా నిర్వహించిన ఇక్కడ పోలీసు అధికారులు ఇన్ అభినందించారు. సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అరుణ్ కుమార్, ఎస్సైలు రాజు వర్మ, వెంకటప్పయ్య పాల్గొన్నారు