అనుమానాస్పద వ్యక్తుల ఆచూకీ ,రిజిస్ట్రేషన్ లేని వాహనాల తనిఖీ కోసమే కార్డెన్ సెర్చ్

సూర్యాపేట డిఎస్పి… నాగభూషణం
తుంగతుర్తి నవంబర్ 23 నిజం న్యూస్
గ్రామాల్లోని వీధుల్లో అనుమానాస్పదిత వ్యక్తుల ఆచూకీ , రిజిస్ట్రేషన్ లేని వాహనాల తనిఖీ కోసమే కా ర్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు సూర్యాపేట డిఎస్పి నాగభూషణం తెలిపారు బుధవారం సాయంత్రం రామాలయం వద్ద దసరా వేడుకలో ఇరు వర్గాల ఘర్షణలో భాగంగా ఎస్సీ ,ఎస్టీ కేసులో విచారణలో పలువురితో మాట్లాడి ,ఇరు వర్గాల మధ్య ఘర్షణను ఏ విధంగా జరిగిందో అనంతరం కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ కొత్తగా కొన్న వాహనానికి కంపల్సరిగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ప్రయోజనాల దృష్ట్యా నూతన యాప్ను ప్రవేశపెట్టాలని దీనితో వాహన నెంబర్ను నమోదు చేసినట్లయితే. ఆ వాహనం నిజమైనదా ,దొంగ దాతెలిసిపోతుందని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్సు, వాహన లైసెన్సును, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. పోలీస్ సిబ్బంది ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. బుధవారం రాత్రి పలు వీధుల్లో పోలీస్ సిబ్బంది తో కలిసి సర్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగారం సి ఏ రాజేష్, ఎస్సై డానియల్ కుమార్ తో పాటు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు