జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా కోదాడవాసి

కోదాడ నవంబర్ 23 నిజం న్యూస్
పట్టణానికి చెందిన భూక్యా నిశాంత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో లో నవంబర్ 19 నుండి 23 జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో అండర్. 13 విభాగం లో బాలుర సింగిల్స్ లో ఫైనల్స్ లో తెలంగాణ రాష్ట్రం తరఫున విజయం సాధించినట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా సెక్రెటరీ తోట రంగారావు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. కాగా నిశాంత్ విజయం సాధించి సూర్యాపేట జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తేవడం పట్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏటుకూరు రామారావు, తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాగా నిశాంత్ విజయం ఉమ్మడి నల్లగొండ జిల్లాకే జిల్లాకు మొట్టమొదటి కీర్తి కిరీటం అని రంగారావు తెలిపారు