సీసీ రోడ్ల అవకతవకలపై ఎండీకి ఫిర్యాదు

నిజం న్యూస్, చండూరు చండూరు పురపాలికలో సీసీ రోడ్ల వివాదం రోజురోజుకు ముదురుతోంది. టి యు ఎఫ్ ఐ డి సి నిధులు రూపాయలు రెండు కోట్లతో నిర్మించిన సిసి రోడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ అధికార పార్టీకి చెందిన నాలుగో వార్డ్ కౌన్సిలర్ అన్నపర్తి శేఖర్ మంగళవారం హైదరాబాదులో సంబంధిత శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఇస్టాను సారంగా వ్యవహరించారని . ప్రొసీడింగ్ ఒకచోట ఉంటే మరోచోట రోడ్లు వేశారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత ఇంజనీరింగ్ విభాగం వారు సైతం ఒకసారి కూడా పర్యవేక్షించలేదని తెలిపారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.