ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు పరిశీలనలో ఉన్న స్త్రీ శక్తి భవనం

* చండూరు రెవిన్యూ డివిజన్ కు మరికొంత సమయం……
కేవలం ఆర్డీవో ఆఫీస్ మాత్రమే ఏర్పాటు
నిజం న్యూస్, చండూరు, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు చండూరును రెవిన్యూ డివిజన్ గా మార్చేందుకు మరి కొంత సమయం పట్టణనునట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏర్పాటు మాత్రం పక్కా అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ cm కెసిఆర్ ఇచ్చిన మాట మేరకు 15 రోజుల్లో ఏర్పాటు మాట ఎటు పోయింది అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటతోపాటు వంద పడకల ఆసుపత్రి ఇతర అభివృద్ధి కార్యక్రమాల పైన ఇంక మంత్రుల సమావేశం జరగాల్సి ఉంది. మంత్రుల సమావేశం అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రెవిన్యూ డివిజన్ ఏర్పాటయితే ఆర్డీవో కార్యాలయం తో పాటు డిఎస్పీ కార్యాలయం కూడా వస్తుందని స్థానికులు భావిస్తున్నారు కానీ కేవలం ఆర్డిఓ ఆఫీస్ మాత్రమే ఏర్పాటు కానుంది. డీఎస్పీ ఆఫీస్ అంటూ ఏమీ ఉండదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా ఆర్ డి ఓ ఆఫీస్ కార్యాలయాన్ని ఎంపీడీవో కార్యాలయానికి సమీపంలో ఖాళీగా ఉన్న స్త్రీ శక్తి భవనాన్ని కేటాయించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం .