సీఎం సహాయనిధికి కేరాఫ్ శిరంశెట్టి

చండూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారికి మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్ సహకారంతో సీఎం సహాయనిది చెక్కులు, ఎల్ఓసిలు అందజేస్తూ ప్రజలకు చేదోడు వాదోడు అవుతున్నారు చండూరుకు చెందిన టిఆర్ఎస్ వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరం శెట్టి శ్రీధర్ బాబు. సోమవారం పట్టణానికి చెందిన మద్దోజు శ్రీనివాసచారికి లక్ష రూపాయల సీఎం సహయనిది చెక్కును శిరంశెట్టి శ్రీధర్ బాబు అందజేశారు. ఇప్పటివరకు ఆయన రూపాయలు 60 లక్షల పైచిలుకు చెక్కులను బాధితులకు అందజేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. చెక్కులను అందజేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరుతున్నారు.