చండూరు పురపాలికలో సిసి రోడ్ల వివాదం

నిజం న్యూస్ , చండూరు , చండూరు పురపాలికలో ఇటీవల Tufiduc నిధులు తో చేపడుతున్న సిసి రోడ్ల నిర్మాణం వివాదాలకు తావిచ్చింది. కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా సిసి రోడ్లు వేస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అన్నేపర్తి శేఖర్ స్వయంగా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సోమవారం ఓ ప్రకటనలో నిజం న్యూస్ కు తెలియజేశారు. ప్రొసి డింగ్ ఒకచోట ఉంటే పనులు మరొకచోట చేపట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తనిఖీలు చేయాల్సిన (ఏ ఈ పబ్లిక్ హెల్త్) ఏనాడు తనిఖీ చేసిన పాపాన పోలేదని ఆయన తెలిపారు . ఇది ఇలా ఉండగా హడావిడిగా పనులు చేపట్టడంతో నాణ్యత ప్రమాణాల పైన కూడా పలు అనుమానాలకు తావిస్తోంది . ఏదేమైనా ఉన్నతాధికారులు ఇటీవల నిర్మించిన సిసి రోడ్లకు నాణ్యత పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు . ఎక్కడ వేయాల్సిన రోడ్లను ఎక్కడ వేశారు అనేది కూడా తేల్చాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది.