ఘనంగా పాల్వాయి జయంతి

నిజం న్యూస్, చండూరు. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 86వ జయంతిని చండూరు మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మండలంలోని స్వగ్రామం ఇడికుడ కు చేరుకున్న ఆయన తనయురాలు, ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి ఇంట్లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు .అనంతరం చండూరు చౌరస్తాలో ఆయన విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి నివాళి అర్పించారు అనంతరం స్థానిక ఓ ఫంక్షన్ హాల్ లో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు కొనియాడారు. టిపిసిసి అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత హాజరై మాట్లాడుతూ పాల్వాయి ఆశ సాధన కోసం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని అప్పటివరకు అంత శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ,చెరుకు సుధాకర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు